ఆసిఫాబాద్‌అర్బన్: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రతిభా కళాశాలలో 2025– 26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. పీటీజీ గిరిజన గురుకులంలో 320 మంది విద్యార్థులకు 300 మంది, గిరిజన బాలికల కళాశాలలో 245 మందికి 221 మంది, గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో 320 మందికి 306 మంది హాజరయ్యారని ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు కారం భద్రయ్య, అనిత వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వారు వివరించారు. పీటీజీ గురుకులంలో అబ్జర్వర్‌గా తిర్యాణి కళాశాల అధ్యాపకురాలు సౌమ్య వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment