కాంగ్రెస్‌తోనే నిరుద్యోగ సమస్య పరిష్కారం
● ఏడాదిలోనే 53 వేల ఉద్యోగాలిచ్చాం ● ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
భైంసాటౌన్/నిర్మల్‌రూరల్/కై లాస్‌నగర్: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో లక్ష మంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించలేదని, కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన ఏడాదిలో 53 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భైంసా పట్టణం, నిర్మల్ మండలం కొండాపూర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వేర్వేరుగా ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల సమస్య పరిష్కరించామని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మతతత్వ బీజేపీ ఉచ్చులో పడి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు. దేవుడు వేరు, రాజకీయం వేరని అన్నారు. బీజేపీ దేవుడిపై, కులమతాల మీదా రాజకీయం చేస్తుందన్నారు. మోదీ బీసీ కాదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కొందరు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులమేంటని అడుగుతున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా వూట్కూరి నరేందర్ రెడ్డికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బూత్‌లవారీగా ఓటర్లను కలిసి కాంగ్రెస్ విజయానికి పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ప్రైవేట్ టీచర్లందరికీ రూ.3 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా కొనసాగినంత కాలం తానే ప్రీమియం చెల్లిస్తానని చెప్పా రు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, అధ్యాపకులకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి హెల్త్‌కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతోపాటు వాటి ఆధునికీకరణకు కృషి చేస్తానని చెప్పారు. లైబ్రరీల్లో పోటీ పరీక్ష ల కోసం సిద్ధమయ్యే అభ్యర్ధులకు మధ్యాహ్న భో జనం అందించే విధంగా సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. భైంసా నియోజకవర్గంలో ఐటీఐ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆది లాబాద్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, , నిర్మల్, సారంగపూర్ ఏఎంసీల చైర్మన్లు భీమ్‌రెడ్డి, అబ్దుల్ అతిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment