శిశుమందిరాలు సంస్కృతికి నిలయాలు
● ఎమ్మెల్యే కోవ లక్ష్మి ● అట్టహాసంగా పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం
ఆసిఫాబాద్‌అర్బన్: సరస్వతి శిశుమందిరాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, శిశుమందిర్ విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్రం సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల ఆవరణలో 1979 నుంచి 2024 వరకు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా నాలుగు దశాబ్దాల తర్వాత ఒకచోట చేరా రు. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముందుగా ఆచార్యులకు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శిశుమందిరాలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యనందిస్తున్నాయమన్నా రు. తెలుగు భాషకు పూర్వవైభవం తేవాలని ఆకా క్షించారు. కాగా అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి గోపికృష్ణ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా స్వదేశానికి వచ్చారు. వేదికపై చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మాజీ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, పాఠశాల విద్యార్థి పరిషత్ నాయకులు శ్రీని వాస్, రాజరెడ్డి, పాఠశాల అధ్యక్షులు చిలువేరు వెంకన్న, విష్ణువర్ధన్, ప్రథమ ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, ప్రతినిధులు బోనగిరి సతీశ్‌బాబు, ప్రధానాచార్యులు, ఆచార్యులు పాల్గొన్నారు.
శిశుమందిరాలు సంస్కృతికి నిలయాలు
Comments
Please login to add a commentAdd a comment