ప్రతిభను వెలికితీసేందుకు టాలెంట్ టెస్టు
ఆసిఫాబాద్‌అర్బన్: పదో తరగతి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు జిల్లావ్యాప్తంగా ఆదివారం టాలెంట్ టెస్టు నిర్వహించినట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, కార్యదర్శి సాయికృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా నాలుగు వేల మంది విద్యార్థులు టాలెంట్ టెస్టుకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రతిభ చూపిన వారికి జిల్లా, మండల స్థాయిలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి కార్తీక్, టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్ తదతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment