దృష్టిలోపం నివారణకు కంటి పరీక్షలు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దృష్టి లోపం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని డీఎంహెచ్‌వో సీతారాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం విద్యార్థులకు నేత్ర వైద్య నిపుణురాలు విశాల కంటి పరీక్షలు నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ గతేడాది రాష్ట్రీయ స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) కింద రెండు విడతలుగా ప్రభుత్వ పాఠశాలల్లో శిబిరా లు ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 931 మంది విద్యార్థులకు కంటిచూపు ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వీరందరికీ కంటి పరీక్షల అనంతరం అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే నోడల్ అధికారి నరేంద్ర, ఆప్తోమెట్రిస్ట్ జగన్‌మోహన్, దినేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment