ఇక్కడ వృథా.. అక్కడ వ్యథ
అందవెల్లి వంతెన వద్ద
వృథాగా పోతున్న భగీరథ నీరు
వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. కాగజ్‌నగర్ మండలంలో అందవెల్లి వంతెన వద్ద నాలుగు రోజుల క్రితం అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించారు. అధికారులు మిషన్ భగీరథ పైప్‌లైన్ కనెక్షన్ తొలగించారు. దీంతో నీరంతా పెద్దవాగులోకి వృథాగా పోతోంది. దీంతో అవతలి వైపు ఉన్న దాదాపు 40 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలు, వాటర్ క్యాన్లతో క్యూ కడుతున్నారు. రోడ్డు పనులు పూర్తయ్యేందుకు సుమారు 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఓ వైపు పైప్‌లైన్ కట్ చేయడంతో తాగునీరు వృథాగా పోతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నీటికి అల్లాడుతున్నారు. – దహెగాం
బ్రహ్మన్ చిచ్యాల గ్రామంలో ట్యాంకరు వద్ద నీటికోసం తిప్పలు
ఇక్కడ వృథా.. అక్కడ వ్యథ
ఇక్కడ వృథా.. అక్కడ వ్యథ
Comments
Please login to add a commentAdd a comment