బాల్యవివాహాలు నేరం
ఆసిఫాబాద్‌అర్బన్: బాల్యవివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని, బాధ్యులకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తారని డీసీపీవో బూర్ల మహేశ్ అన్నారు. రెబ్బెన మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు జిల్లా కేంద్రంలోని రాజంపేటకు చెందిన యువకుడితో ఆదివా రం వివాహం జరగాల్సి ఉంది. 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు అందిన సమాచారం మేరకు బాలరక్ష భవన్ సిబ్బంది వెళ్లి వివాహం అడ్డుకున్నారు. అనంతరం బాలికను ఆసిఫాబాద్ సఖి కేంద్రానికి తరలించారు. సోమవారం ఇరు కుటుంబాలు, కుల పెద్దలకు కౌ న్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహంతో ఎదురయ్యే ఆరోగ్య, మానసిక సమస్యలను వివరించారు. డీసీ పీవో మాట్లాడుతూ చిన్న వయస్సులో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి బంగారు భవిష్యత్తు నాశనం చేయొద్దన్నారు. ఉన్నత చదువులు చదివించి, 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్‌కుమార్, కౌన్సెలర్ చంద్రశేఖర్, రవళి, జమున, సఖి కేంద్రం అడ్మి న్ మమత, సుమలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment