అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
ఆసిఫాబాద్‌అర్బన్: రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎస్‌వో వినోద్‌కుమార్‌తో కలిసి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా కొన్నా.. అమ్మినా పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ 2016 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం అందిస్తుందన్నారు. రేషన్ కార్డుదారులు ఈ బియ్యాన్ని కుటుంబ అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment