సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లాలి
రెబ్బెన: రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉద్యోగులంతా ముందుకెళ్లాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాల య కాన్ఫరెన్స్ హాల్‌లో శాప్ ఫైల్ లైఫ్ సైకిల్ కార్యక్రమంపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగి తపు రహిత ఉత్తర, ప్రత్యుత్తరాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న సింగరేణి అందుకు తగిన చర్యలను వేగవంతం చేసిందన్నారు. పర్యావరణహిత చర్యల్లో భాగంగా కాగితాలకు ప్రత్యమ్నాయంగా వినియోగించే శాప్ ఫైల్ లైఫ్ సైకిల్‌పై ప్రతి ఒక్కరూ అవగా హన కలిగి ఉండాలన్నారు. కాగితపు రహిత ఉత్తర, ప్రత్యుత్తరాలల్లో బెల్లంపల్లి ఏరియా ముందుండాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్ నుంచి సింగరేణి వ్యాప్తంగా పేపర్ లె స్ ప్రక్రియ అమలులోకి రానుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం రాజమల్లు, పీవో నరేందర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఐటీ ఇన్‌చార్జి ముజీబ్, కార్పొరేట్ ఐటీ అధికారులు హరిప్రసాద్, కిరణ్‌కుమార్, శంకర్, రమ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment