హెచ్‌ఐవీ పరీక్షలు చేయాలి
కెరమెరి: సాధారణ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగుల్లో 10 శాతం మందికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పరీక్షలు చేయాలని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల హెచ్‌ఐవీ, ఎయిడ్స్ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నీలిమ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్య సిబ్బంది, రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు గర్భిణులకు మాత్రమే హెచ్‌ఐవీ పరీక్షలు చేసేవారని, ఇకనుంచి రోగులకు కూడా చేయాలన్నారు. ఆస్పత్రిలో కిట్స్ అందుబాటులో ఉంచాలని, రోగుల నుంచి రక్తపూతలు తీసి ఎప్పటికప్పుడు ల్యాబ్‌కు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రియాజ్, సూపర్‌వైజర్ మెస్రం సోము, హెచ్‌ఏలు వసంత్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment