● 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ● జిల్లాలో 2,70,199 మంది ● ఇప్పటి వరకు పరీక్షలు పూర్తయినవారు 2,36,678 ● మిగిలిన వారికి రేపటి నుంచి ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

● 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ● జిల్లాలో 2,70,199 మంది ● ఇప్పటి వరకు పరీక్షలు పూర్తయినవారు 2,36,678 ● మిగిలిన వారికి రేపటి నుంచి ప్రారంభం

Published Wed, Feb 19 2025 1:50 AM | Last Updated on Wed, Feb 19 2025 1:46 AM

● 30

● 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ● జిల

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ఆదేశాల మేరకు గతేడాది నవంబర్‌ నుంచి జిల్లాలో 30 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. జిల్లాలో 30 ఏళ్లు పైబడినవారు 2,70,199 మంది ఉండగా ఈ ఏడాది జనవరి వరకు 2,36,678 (87 శాతం)మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. మిగిలిన వారికి ఈ నెల 20 నుంచి ఇంటింటా తిరుగుతూ పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తులు 6,471 మంది, అధిక రక్తపోటు ఉన్నవారు 18,667 మంది ఉన్నారు. ఈ వ్యాధి బారినపడి ఒక్కరు కూడా మరణించకూడదన్న ఉద్దేశంతో మిషన్‌ మధుమేహ 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మధుమేహం అంటే..

మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. రక్తంలో చక్కెరస్థాయి పెరిగితే వ్యాధి బారిన పడినట్లు. శరీరంలో ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ సరిపడా ఉత్పత్తి కాకపోవడం.. సరిగా పనిచేయకపోవడంతో ఈ వ్యాధి వస్తుంది. జన్యుపరమైన కారణాలు, ఇంతకు ముందు కుటుంబంలో ఎవరికై నా ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక బరువుతో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు..

అధిక మూత్ర విసర్జన, ఎక్కువ దాహం, అధిక ఆకలి, అలసట, శరీర బరువు తగ్గడం లేదా పెరగడం, గాయం మానడంలో ఆలస్యం, చర్మ సమస్యలు, కాళ్లలో నొప్పులు ఉంటాయి.

నియంత్రణకు..

తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారం తీసుకోవా లి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అధిక బరువును తగ్గించుకోవడంతో రక్తంలో చక్కెరస్థాయి నియంత్రణ సులభమవుతుంది.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు..

జిల్లాలో డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మొదట పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేశాం. అనుకున్న లక్ష్యం సాధించి మిగిలిన గ్రామాల్లో వ్యాధిగ్రస్తులను గుర్తించి అవగాహన కల్పిస్తాం.

– సీతారాం, డీఎంహెచ్‌వో

మార్చి నాటికి పూర్తి..

జిల్లాలో 30 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి గతేడాది నవంబర్‌ నుంచి మధుమేహ పరీక్షలు చేస్తున్నాం. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నాం. మార్చి చివరి నాటికి అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేస్తాం.

– వినోద్‌కుమార్‌, ప్రోగ్రాం అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
● 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ● జిల1
1/2

● 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ● జిల

● 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ● జిల2
2/2

● 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ● జిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement