బెజ్జూర్(సిర్పూర్): బెజ్జూర్ మండలం చిన్న సిద్దాపూర్, ఎల్కపల్లి గ్రామాల్లోని సర్వే నం.761, 762 సర్వే నంబర్లలో త్వరలో రెవెన్యూ, అటవీశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు తెలిపారు. ఆదివారం మండలంలోని చిన్నసిద్దాపూర్ గ్రామంలోని పర్యటించిన వారికి గ్రామస్తులు సమస్యలు విన్నవించారు. రైతులు మాట్లాడుతూ దాదాపు వంద మందికి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 761, 762 సర్వే నంబర్లలో పట్టాలు ఇచ్చిందన్నారు. 2018లో భూప్రక్షాళన సర్వే అనంతరం మళ్లీ పట్టాలు రాలేదని తెలిపారు. ఆ భూములు అటవీ శాఖ కు చెందినవని అధికారులు అడ్డుపడి పట్టా లు రద్దు చేసినట్లు వాపోయారు. అధికారు ల తీరుతో ఇబ్బంది పడుతున్నామన్నారు. స్పందించిన ఎమ్మెల్సీ త్వరలో జాయింట్ సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సిడాం గణపతి, నాయకులు జగ్గాగౌడ్, శ్రీవర్ధన్, సురేశ్, శ్రీను తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment