జలం.. నిష్ఫలం
పెంచికల్‌పేట్(సిర్పూర్): వేసవి ప్రారంభంలోనే అన్నదాతలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రాజెక్టుల్లో సాగునీరున్నా కాలువలకు మరమ్మతులు లేక పొలాలకు చేరడం లేదు. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామం వద్ద బొక్కివాగుపై ప్రభుత్వం రూ.17 కోట్ల వ్యయంతో 2012లో బొక్కివాగు నిర్మించింది. 2500 ఎకరాలకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో కుడి, ఎడమ కాలువలు నిర్మాణం పూర్తి చేసింది. అప్పటి నుంచి కాలువలకు మరమ్మతులు చేపట్టలేదు. నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారాయి. కాలువల తీరుతో ప్రస్తుతం యాసంగిలో వరిసాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
పిచ్చిమొక్కలు, పూడికతో నిండి..
బొక్కివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద కాలువలు సక్రమంగా లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం యాసంగిలో 500 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల్లో నిండా చెత్తాచెదారం, పూడిక పేరుకుపోయింది. విపరీతంగా పిచ్చిమొక్కలు పెరిగాయి. అలాగే కా లువల సీసీ రెయిలింగ్ కూడా దెబ్బతినడంతో నీరు సక్రమంగా పారడం లేదు. ఏటా వర్షాకాలంలో కా లువలకు ఇరువైపులా రెయిలింగ్ వరద ప్రవా హానికి దెబ్బతింటోంది. మట్టి, రెయిలింగ్ కూలి పోయి నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతోంది. చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగించేవారు లేక రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రాజెక్టు సమీపంలో భూములు ఉన్నవారే నీటిని మళ్లించడానికి కాలువల్లోని మట్టి, చెత్తచెదారం తొలగిస్తున్నారు.
మరమ్మతులు చేయాలి
బొక్కివాగు ప్రాజెక్టులో పుష్కలంగా నీరుంది. అయినా పంట పొలాలకు చేరడం లేదు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు వెంటనే మరమ్మతులు చేయించాలి. వరి పొలాలు ఎండిపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి.
– కృష్ణమూర్తి, ఎల్లూర్, మం.పెంచికల్‌పేట్
బొక్కివాగు ప్రాజెక్టులో పుష్కలంగా నీరు
చెత్తాచెదారం, పూడికతో అధ్వానంగా కాలువలు
పంటలకు అందని సాగునీరు
రైతులకు తప్పని ఇబ్బందులు
జలం.. నిష్ఫలం
జలం.. నిష్ఫలం
Comments
Please login to add a commentAdd a comment