ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
● 98శాతం హాజరు నమోదు
ఆసిఫాబాద్‌రూరల్: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాలో ఆదివారం నిర్వహించిన గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఐదో తరగతిలో ప్రవేశాలతోపాటు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన పరీక్ష కోసం జిల్లావ్యాప్తంగా పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3,893 మంది విద్యార్థులకు 3,828 మంది హాజరు కాగా 65 మంది గైర్హాజరయ్యారని సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలల జిల్లా కోఆర్డినేటర్(డీసీవో) శ్రీనివాసరావు తెలిపారు. 2,106 బాలురులకు 2,071 మంది హాజరు కాగా, అలాగే 1,787 మంది బాలికలకు 1,757 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, పీటీజీ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సిబ్బందికి సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment