సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేయాలి

Published Sat, Mar 1 2025 8:21 AM | Last Updated on Sat, Mar 1 2025 8:18 AM

సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేయాలి

సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేయాలి

● డీఆర్‌డీవో దత్తారాం

రెబ్బెన: ఉపాధి హామీ సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం కూలీలు పనులు చేయాలని డీఆర్‌డీవో దత్తారాం అన్నారు. శుక్రవారం మండలంలోని నక్కలగూడ శివారులో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా చేపట్టిన ఫారంపాండ్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ కూలీలందరూ రోజుకు రూ.300 కూలి పడేలా పనిచేయాలన్నారు. సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేస్తే కూలి వస్తుందన్నారు. రోజుకు 4 నుంచి 5 గంటలు పని చేయాలన్నారు. అనంతరం ఇందిరానగర్‌ నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో, ఈసీ, టీఏలు, ఎఫ్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement