అర్జీలు వేగంగా పరిష్కరించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● కలెక్టరేట్‌లో ప్రజావాణి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణిలో ప్రజలు అందించే అర్జీలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అద నపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన పట్టా భూమికి హద్దులు నిర్ధారించాలని రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన మసాడి రాజేశ్వరి దరఖాస్తు చేసుకుంది. ఎన్‌టీఆర్ సాగర్ ప్రాజెక్టులో చేపలు పెంచడానికి అవకాశం కల్పించా లని తిర్యాణి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు కోరారు. తన పట్టా భూమిని నిషే ధిత జాబితా నుంచి తొలగించాలని బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన చాపిడి శంకర్ విన్నవించాడు. దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లికి చెందిన చౌదరి ఓంకార్ వినతిపత్రం సమర్పించాడు. ప్రస్తుతం తాను సాగు చేసుకుంటున్న భూమికి పట్టా మంజూరు చేయాలని బెజ్జూర్ మండలం ముంజంపల్లికి చెందిన నికోడే లచ్చుంబాయి వేడుకుంది. సదరం సర్టిఫికెట్ అందించాలని కౌటాల మండలానికి చెందిన శంకర్ కోరాడు. దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని వాంకిడి మండలానికి చెందిన మురళీ, మహేందర్ దరఖాస్తు చేసుకున్నారు. వాంకిడి మండలం సరండి శివారులోని భూమిని ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని రాజేశ్వర్ విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు నిర్ణీత గడువులోగా న్యాయం చేయాలన్నారు.
వేతనం రావడం లేదు
చింతలమానెపల్లి మండలం డబ్బా రైతువేదికలో 2021 నుంచి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నా. ప్రారంభంలో మూడు నెలలు సక్రమంగా చెల్లించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు వేతనం రావడం లేదు.
– నక్క జగానంద్, చింతలమానెపల్లి
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment