అందవెల్లి వంతెనపై రాకపోకలు షురూ
దహెగాం(సిర్పూర్): కాగజ్‌నగర్ మండలం అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పనులు పూర్తికావడంతో సోమవారం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. 2021లో భారీ వరదలకు పెద్దవాగు ఉప్పొంగి వంతెన కుంగిన విషయం తెలిసిందే. మరోసారి వరదలు వచ్చి వంతెన మరింత కుంగి ప్రమాదకరంగా మారింది. 2023లో వంతెన కూలడంతో పూ ర్తిగా రాకపోకలు నిలి చిపోయాయి. వాగులో తాత్కాలిక రోడ్డు వేసి రాకపోకలు సాగించా రు. గతేడాది వంతెన మరమ్మతులు పూర్తి కాగా, వర్షాకాలంలో మట్టితో తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు వేసి ప్రయాణాలు పునరుద్ధరించారు. గత నెలలో మళ్లీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించడంతో మ రోసారి వాగులో నుంచి తాత్కాలిక రోడ్డు వే శారు. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తికావడంతో వాహనాల రాకపోకలకు అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment