Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pak high commission official asked to leave India in 24 hrs1
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్‌

ఢిల్లీ :న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారి తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉ‍న్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్‌ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది.

Term Insurance For Financial Security2
ఆర్థిక భద్రతకు టర్మ్ ఇన్సూరెన్స్: అధ్యయనంలో వెల్లడైన విషయాలు

డిజిటల్ ప్రపంచంలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ, భారతదేశంలోని యువతరం, అంటే జెన్ Z, ఆర్థిక భద్రత విషయంలో మాత్రం ఎంతో ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తోంది. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ఒక కొత్త అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. దీర్ఘకాలిక భద్రత, తక్కువ ధర, సులభమైన విధానాల కారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ వారికి ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనంగా మారుతోంది.'కొత్త తరం అలవాట్లు, సంప్రదాయ విలువలు: ఆర్థిక ప్రణాళికలపై జెన్ Z తీరు' అనే పేరుతో 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల ఉద్యోగం చేస్తున్న జెన్ Z యువతపై ఈ పరిశోధన చేశారు. ఈ తరం టెక్నాలజీతో పాటు భద్రతకు కూడా సమానమైన ప్రాముఖ్యత ఇస్తోంది. టర్మ్ ఇన్సూరెన్స్‌ను వారు కేవలం ఒక రక్షణగా మాత్రమే కాకుండా, తమ ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా భావిస్తున్నారు.ముఖ్యమైన విషయాలుటర్మ్ ఇన్సూరెన్స్‌కు అధిక ప్రాధాన్యం: పెరుగుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు, తక్కువ ధరలో అందుబాటులో ఉండటం వల్ల జెన్ Z టర్మ్ ప్లాన్‌లను ఎక్కువగా ఎంచుకుంటోంది. 31 శాతం మంది టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇతర జీవిత బీమా పాలసీల కంటే ఎక్కువ. ప్రతి నలుగురిలో ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు సంపదను పెంచే ప్లాన్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్న వారిలో 57 శాతం మంది నెలకు రూ. 2,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.ముందస్తు రిటైర్మెంట్ ఆలోచనలు: జెన్ Z తరం వీలైనంత త్వరగా పదవీ విరమణ చేయాలని కోరుకుంటోంది. ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి, త్వరగా రిటైర్ అవ్వాలనే సిద్ధాంతంపై వారి ఆసక్తి పెరుగుతోంది. దీనివల్ల వారు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గత తరాల వారిలా కాకుండా, 18 శాతం మంది ఇప్పటికే రిటైర్మెంట్ మరియు పెన్షన్ ప్లాన్‌ల గురించి ఆలోచిస్తున్నారు.ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాముఖ్యత: జెన్ Z ఆరోగ్యం, సంక్షేమం వంటి ప్రయోజనాలు లేని ఆర్థిక సాధనాలపై ఆసక్తి చూపడం లేదు. జీవిత బీమా సంస్థను ఎన్నుకునేటప్పుడు 60 శాతం మంది ఆరోగ్య ప్రయోజనాలు అందించే వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలతో పోలిస్తే పురుషులు (65 శాతం) వెల్‌నెస్ ప్రయోజనాలకు ఎక్కువ విలువ ఇస్తున్నారు.టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గిరీష్ జె. కల్రా మాట్లాడుతూ, జెన్ Z డిజిటల్ తరం వారైనప్పటికీ, దీర్ఘకాలిక భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ వంటి వాటిని ఎంచుకుంటున్నారని చెప్పారు. ఆర్థిక భద్రత, ఆరోగ్యం మరియు ముందస్తు రిటైర్మెంట్ ప్రణాళికలపై దృష్టి పెడుతూ వారు తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నారని ఆయన అన్నారు.జెన్ Z ఎక్కువగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినప్పటికీ, ఆర్థిక విషయాల్లో మాత్రం విశ్వసనీయమైన వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. 53 శాతం మంది బీమా పాలసీల కోసం ఏజెంట్లు లేదా బ్యాంక్ సలహాదారులపై ఆధారపడుతున్నారు. అయితే, 25 శాతం మంది సోషల్ మీడియా నుండి కూడా ఆర్థిక సలహాలు తీసుకుంటున్నారు. జెన్ Z తరం చిన్న వయస్సులోనే ఆర్థిక విషయాల్లో మెరుగైన అవగాహన కలిగి ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్‌ను ముందుగానే తీసుకోవడం, రిటైర్మెంట్ కోసం ప్రణాళికలు వేసుకోవడం, సంపదతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారు భవిష్యత్తులో దేశ ఆర్థిక ప్రణాళికలను మారుస్తున్నారు.

YS Jagan To Visit Kallittanada In Sri Sathya Sai District Updates3
వీరజవాన్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్‌ ముడావత్‌ మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.మురళీనాయక్‌ అందరికీ స్ఫూర్తిదాయకం..పరామర్శ అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్‌ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్‌ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీనాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌.. అనంతరం తిరుగు పయనమయ్యారు.

Congress MP Shashi Tharoor On PM Modi's Pak Conflict Speech4
‘మోదీ జీ.. మీరు దేశాన్ని నడిపిస్తున్న తీరు అమోఘం’

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అఘోఘమని శశిథరూర్ కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాకిస్తాన్ కు ఒక క్లియర్ మెస్సేజ్ పంపించారని అన్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్న దానిని అస్సలు పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఏం జరిగిందో అంతా చూశారన్నారు శశిథరూర్. భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతను సమర్థవంతంగా తిప్పికొట్టారని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదన్నారు శశిథరూర్.ప్రధానిగా మోదీ దేశానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. ప్రత్యేకంగా సంక్షోభ సమయంలో మోదీ వ్యవహరిస్తున్నరు నిజంగా అద్భుతమన్నారు. అది కోవిడ్ లాంటి మహమ్మారి అయినా దేశ ద్రోహులపై చేసే యుద్ధమైనా మోదీ స్పందిస్తున్న తీరు వెలకట్టలేనిది. ఏది దేశానికి ముఖ్యమో అది మోదీ ఒక ప్రధానిగా చేసి చూపిస్తున్నారని శశిథరూర్ ప్రశంసించారు. ఈ మేరకు జాతీయ మీడియా ఎన్డీటీవో మాట్లాడిన శశిథరూర్.. దేశాన్ని నాలుగు కోణాల్లో చూస్తూ ముందుండి నడిపిస్తున్న నేత మోదీ అని కొనియాడారు. భారత్ సంక్షోభంలో ఉన్న ప్రతీసారి మోదీ ఇకపై కూడా ఇలానే వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు లోక్ సభ ఎంపీ శశథరూర్.ఇక్కడ చదవండి: ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ

England Announced ODI, T20 Squad For West Indies Series5
IPL 2025: గుజరాత్‌, ఆర్సీబీ, ముంబై జట్లకు భారీ షాకిచ్చిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌కు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు షాకిచ్చింది. ప్లే ఆఫ్స్‌ రేసులో ముందు వరుసలో ఉన్న ఈ మూడు జట్లకు చెందిన ప్రధాన ఆటగాళ్లను త్వరలో వెస్టిండీస్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఐపీఎల్‌ 2025లో కీలకమైన ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు జరుగుతుండగా వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ మధ్య వన్డే సిరీస్‌ జరుగనుంది. భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్‌ వారం రోజుల వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం ప్రకటించిన రివైజ్డ్‌ షెడ్యూల్‌తో ఈ సిరీస్‌ క్లాష్‌ అయ్యింది.ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌లో తొలి వన్డే మే 29న, రెండో వన్డే జూన్‌ 1, మూడో వన్డే జూన్‌ 3వ తేదీన జరుగనున్నాయి. సరిగ్గా ఇదే తేదీల్లో ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1, క్వాలిఫయర్‌-2, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ రేసుకు సమీపంలో ఉన్న జట్లకు చెందిన ఆటగాళ్లను, అదే తేదీల్లో జరిగే సిరీస్‌కు ఎంపిక చేయడంతో సదరు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు పాలుపోవడం లేదు. ఇంగ్లండ్‌ వన్డే జట్టుకు ఎంపిక చేసిన ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌ గుజరాత్‌కు.. జేకబ్‌ బేతెల్‌ ఆర్సీబీ.. విల్‌ జాక్స్‌ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నారు. ఈ మూడు ఫ్రాంచైజీలకు ఈ ముగ్గురు ఆటగాళ్లు చాలా కీలకం.ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో బట్లర్‌, బేతెల్‌, జాక్స్‌ లేకపోవడం ఆయా జట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు లీగ్‌ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. తాజాగా ఇం​గ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి.ఆటగాళ్లు కూడా దేశమా.. ఐపీఎలా అన్న సందిగ్దంలో ఉండిపోయారు. ఐపీఎల్‌ వాయిదా పడటం ఇన్ని సమస్యలు తెచ్చి పెట్టింది. విండీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు తదుపరి జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (జూన్‌ 6, 8, 10) కోసం కూడా ఇంగ్లండ్‌ జట్లను ఇవాళ ప్రకటించారు. రెండు జట్లకు సారధిగా హ్యారీ బ్రూక్‌ ఎంపికయ్యాడు.వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌ (గుజరాత్‌), జేకబ్‌ బేతెల్‌ (ఆర్సీబీ), విల్‌ జాక్స్‌ (ముంబై ఇండియన్స్‌), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్‌ రాయల్స్‌), జేమీ ఓవర్టన్‌ (సీఎస్‌కే), గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, జో రూట్, జామీ స్మిత్విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, టామ్ బాంటన్, జేకబ్‌ బేతెల్‌, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్జోఫ్రా ఆర్చర్‌, జేమీ ఓవర్టన్‌ కూడా వేర్వేరు ఐపీఎల్‌ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఆ జట్లు ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.మరోవైపు ఇదే సిరీస్‌ (వన్డే) కోసం విండీస్‌ జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. విండీస్‌ ఆటగాళ్లలో ఫెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (గుజరాత్‌), రొమారియో షెపర్డ్‌ (ఆర్సీబీ), షమార్‌ జోసఫ్‌ (లక్నో) వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నారు. రూథర్‌ఫోర్డ్‌, రొమారియో షెపర్డ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లు కూడా ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. అయితే ఈ సిరీస్‌తో ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు క్లాష్‌ కావడంతో వీరు కూడా ఆయా జట్లకు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది.

Narendra Modi Speak About Indian Air Force in Adampur Air Base6
ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ

ఆదంపూర్‌: భారత్‌ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో సైనికులు భారత్‌ మాతాకీ జై అంటే.. శత్రువు వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ తరువాత మంగళవారం ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. అక్కడ వాయుసేన సేవలను ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ తన సత్తా చూపించిందని అన్నారు. భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని అన్నారు. యుద్ధ రంగంలో మన సైనికులు చరిత్ర సృష్టించారని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనేది ప్రపంచమంతా మార్మోగిందని, ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నా జీవితం ధన్యమైంది‘దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారు. భారత్ శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. మన సైన్యం సామర్థ్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. వీర సైనికులందరికీ నా సెల్యూట్. ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగింది. సైన్యం దేశ ఆత్మ విశ్వాసం పెంచింది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సిద్ధాంతం. అక్క చెల్లెల సిందూరం తుడిచినవారిని నాశనం చేశాం’ అని మోదీ సైన్యాన్ని కొనియాడారు.‘గురిచూసి కొట్టిన దెబ్బతో.. శత్రు స్థావరాలు మట్టిలో కలిశాయి. వారు వెనుక నుంచి దాడి చేస్తే.. మీరు ముందు నిలబడి ధైర్యంగా దాడిచేశారు. పాకిస్తాన్ డ్రోన్స్, యూవీఏలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోయాయి. పాక్ శత్రువులు పౌరులను అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడింది. కానీ మీరు మాత్రం పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా శత్రువును దెబ్బకొట్టారు. అణు బ్లాక్ మెయిల్‌ను భారత్ ఎప్పటికీ సహించదు. మళ్ళీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.#WATCH | At the Adampur Air Base, PM Narendra Modi said, "Besides manpower, the coordination of machine in #OperationSindoor was also fantastic. Be it India's traditional air defence system which has witnessed several battles or our Made in India platforms like Akash - all of… pic.twitter.com/Y2dYnanFmN— ANI (@ANI) May 13, 2025

Former MLA Vallabhaneni Vamsi Gets Bail7
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌

విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌ వచ్చింది. సత్యవర్థన్‌ కేసులో వంశీకి బెయిల్‌ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశా­రనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్‌­ఎస్‌ క్లాజ్‌ 140 (1), 308, 351 (3) ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్‌ చేశారు. తాజాగా వంశీకి బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. రూ. 50 వేలతో పాటు రెండు షురీటిలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వంశీతో పాటు మరో నలుగురకి బెయిల్‌ వచ్చింది. సత్యవర్డన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. ఈ రోజు(మంగళవారం) కోర్టుకు హాజరయ్యారు. వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిసన్‌ పై విచారణ చేపట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు.. బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Ys Jagan Announces Financial Assistance Of Rs 25 Lakh To Murali Naik Family8
వీర జవాన్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం: వైఎస్‌ జగన్‌

శ్రీసత్యసాయి జిల్లా: వీర జవాన్‌ మురళీ నాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్‌ మురళీనాయక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం అని.. ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్‌ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

BRS MLA Harish Rao Clarifies Issues In Party9
కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే.. : హరీష్‌ రావు ఏమన్నారంటే

హైదరాబాద్: బీఆర్ఎస్ లో విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా వస్తున్న రూమర్లకు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు చెక్ పెట్టారు. అసలు బీఆర్ఎస్ లో విభేదాలున్నాయనే వార్తల్లో నిజం లేదన్నారు. దీనిపై ఈరోజు(మంగళవారం) హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ‘ మా పార్టీ బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవు. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా. మా అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా’ అని హరీష్ రావు స్పష్టం చేశారు.కాగా, ఎప్పట్నుంచో ‘బీఆర్ఎస్ లో విభేదాలు’ అనే మాట తరచు వినిపిస్తూ వస్తోంది. ప్రధానంగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ బాధ్యతల్ని ఎవరు మోస్తారు అనేది ప్రధానంగా నడిచే చర్చ. ఇక్కడ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆ బాధ్యతల్ని తీసుకుంటారా?, లేక మేనల్లుడైన హరీష్ రావు తీసుకుంటారా? అనే దానిపై రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే, హరీష్ రావు పరిస్థితి ఏంటి?, హరీష్ రావు మరొక పార్టీవైపు కన్నేస్తారా? అనేదే ప్రధానంగా నడిచిన చర్చ.దీనికి ముగింపు పలికారు హరీష్ రావు. తమ పార్టీలో విభేదాలు లేవని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే తనకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు. , దాన్ని తాను స్వాగతిస్తాననన్నారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానన్నారు హరీష్‌ రావు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీష్‌ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్‌ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్‌ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌కు టైమ్‌ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు.

Samantha Subham Movie Box Office Collection Details10
సమంత కొత్త జర్నీ.. సక్సెస్‌ అయినట్లేనా?

స్టార్‌ హీరోయిన్‌ సమంత(samantha) కొత్త జర్నీ ప్రారంభించింది. ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను ప్రేక్షకులను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మంచి టాక్‌ సంపాదించుకొని బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.మూడు రోజుల్లో 5.25 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే..ఇది మంచి నెంబరనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ చిత్రానికి రూ. 3.5 కోట్ల బడ్జెట్‌ అయినట్లు సమాచారం. రిలీజ్‌కి ముందే సమంత తనకున్న పలుబడితో టేబుల్‌ ప్రాఫిట్‌ని పొందినట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్‌, శాటిలైట్‌ హక్కులను మంచి రేటుకే అమ్మేసిందట. షూటింగ్‌కి ముందే ‘జీ’ సంస్థతో డీల్‌ కుదుర్చుకుందట సమంత. సినిమా మొత్తం ఓ సీరియల్‌ చుట్టు తిరుగుతుంది.. అది జీ టీవీలో ప్రసారం అయ్యే సీరియల్‌గా చూపిస్తామని ‘బ్రాండింగ్’మాట్లాడుకున్నారట. ఆ తర్వాత అదే సంస్థ ఓటీటీ, శాటిలైట్‌ హక్కులను దక్కించుకుంది. నిజానికి ఇలాంటి చిన్న సినిమాకి రిలీజ్‌ ముందే బిజినెస్‌ జరగడం చాలా అరుదు. పెద్ద పెద్ద సినిమాలకే ఓటీటీ బిజినెస్‌ కావడం లేదు. సమంత ఉంది కాబట్టే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ రిలీజ్‌కి ముందే సేల్‌ అయ్యాయి. ఇక రిలీజ్‌ తర్వాత మంచి టాక్‌ రావడం.. వసూళ్లు రోజు రోజుకి పెరగడంతో ‘శుభం’తో సమంతకు మంచి లాభాలే వచ్చేశాయి. మొత్తానికి సమంత కొత్త జర్నీ లాభాలతోనే ప్రారంభం అయింది. భవిష్యత్తులో ఆమె బ్యానర్ నుంచి మరిన్ని క్వాలిటీ సినిమాలు, బలమైన కథలతో వస్తే, 'సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్'గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement