ఉందా ‘చెత్త’శుద్ధి?
ఈ రెండు చిత్రాలు ప్రభుత్వాల ‘చెత్త’శుద్ధికి నిదర్శనాలు.. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రణాళికా బద్ధ చర్యలతో అద్దంలా మెరిసిపోతున్న ఏలూరు కాలువ.. ఆ పక్కనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో కంపుకొడుతున్న అదే ఏలూరు కాలువ.
విజయవాడ నలువైపులా ప్రవహిస్తున్న కాలువల ప్రక్షాళనకు గత ప్రభుత్వం నడుం బిగించి పనులు చేపడితే.. ప్రస్తుతం ప్రభుత్వం ఆ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కాలువ గట్ల సుందరీకరణ అట కెక్కింది. ఎక్కడా చెత్త కనపడకుండా గత ప్రభుత్వంలో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా మేటలు వేసిన చెత్త దర్శనమిస్తూ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తోంది. ముఖ్యంగా కాలువ గట్లు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. నగరంలో 20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బందరు, ఏలూరు, రైవస్ కాలువలను గత ప్రభుత్వ హయాంలో నిత్యం పరిశుభ్రంగా ఉంచారు. కాలువ గట్ల సుందరీకరణను యజ్ఞంలా నిర్వహించారు. ఆ పనులను ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా పట్టించుకోకపోవడంతో మందకొడిగా సాగుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
ఉందా ‘చెత్త’శుద్ధి?
Comments
Please login to add a commentAdd a comment