వైభవంగా మల్లన్న తలపాగా గ్రామోత్సవం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేవాంగ సంక్షేమ సంఘం విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా విభాగాల ఆధ్వర్యంలో శ్రీశైల మల్లన్న తలపాగా ఊరేగింపు మహోత్సవం సోమవారం నగరంలో వైభవంగా నిర్వహించారు. విజయవాడలోని వన్‌టౌన్‌లో ఉన్న పురాతన ఆలయం శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం (పాత శివాలయం)లో శ్రీశైల మల్లన్న తలపగాకు విశేష పూజలు చేశారు. అనంతరం పాత శివాలయం నుంచి గుణదలలోని దేవాంగ సంక్షేమ సంఘం హాస్టల్ వరకు ఊరేగింపు కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం విజయవాడ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యక్కల శంకర్రావు, రెడ్డి తులసీరామ్, జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గిద్దలూరు ఎర్రి స్వామి, జిగడం శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని తరాలుగా దేవాంగ వంశస్తులైన తొమ్మిది కుటుంబాలు శ్రీశైల మల్లన్న తలపాగా నేతలో తరిస్తున్నాయని వివరించారు. తలపాగా తయారీకి స్వచ్ఛమైన తెల్లటి దారాన్ని మాత్రమే ఉపయోగిస్తారని, తొలిసారిగా విజయవాడలో తలపాగా ఊరేగింపు చేశామన్నారు. ఎంతో విశిష్టత ఉన్నత శ్రీశైల మల్లన తలపాగా దర్శనం ముక్తిదాయకమని వారు చెప్పారు. మహా శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం తర్వాత భక్తులు మల్లన్న పాగా దర్శనం చేసుకుని తరిస్తారని వివరించారు. కార్యక్రమంలోజిల్లా నేతలు దంతం మురళి, జి.శంకరకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment