
మధుమేహం వచ్చే ప్రమాదం..
నైట్రోజన్ డయాకై ్సడ్ అధికంగా ఉన్న గాలిని పీల్చేవారు మధుమేహం బారిన పడతారు. గాలిలో 2.5 మైక్రో మీటర్ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న కాలుష్య పదార్థాలు ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి చేరి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచడమే కాక, ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతకు కారణభూతమై మధుమేహానికి దారితీస్తాయి. వాహనాల శబ్దకాలుష్యంతో నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడితో హార్మోన్లు, మెటబాలిజం అసమతుల్యతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఆ ఫలితంగా మధుమేహం రావచ్చు.
– డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు