
రూ. 28.97లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో పలు కేసులకు సంబంధించి సీజ్ చేసిన మద్యం బాటిళ్లను శుక్రవారం జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్. గంగాధరరావు ఇతర అధికారులతో కలసి మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ చేత ధ్వంసం చేయించారు. జిల్లావ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాతో పాటు సారా తయారీ కేంద్రాలపై జరిపిన దాడులకు సంబంధించి 814 కేసులు నమోదు చేసిన పోలీసులు.. రూ. 28,97,000 విలువ గల 15,280 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే 65 ఎకై ్సజ్ కేసులకు సంబంధించి 684.83 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. వీటిని శుక్రవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2023 నుంచి ఇప్పటి వరకు సీజ్ చేసిన అన్ని మద్యం బాటిళ్లు, సారాను ధ్వంసం చేయించినట్లు తెలిపారు. అక్రమ మద్యం రవాణా, సారా తయారీలకు సంబంధించి సమాచారం ఉంటే హెల్ప్‌లైన్ 14405, డయల్ 100, 112లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, బందరు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం డీఎస్పీలు సీహెచ్ రాజ, శ్రీవిద్య, వి. ధీరజ్‌నీల్, సీహెచ్ శ్రీనివాసరావు, డీటీసీ డీఎస్పీ జి. శ్రీనివాసరావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రూ. 28.97లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం