
సమన్వయంతో బాల్య వివాహాలు అరికట్టాలి
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ శాఖల అధికారు లు సమన్వయంతో వ్యవ హరించి బాల్య వివాహాల ను అరికట్టాలని మహిళా, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రట రీ సూర్యకుమారి అన్నా రు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, తహసీల్దార్లు, మండల విద్యాధికారులు, వైద్యారోగ్యశాఖ, పోలీసు అధికారులతో బాల్య వివాహాలను అరికట్టేందుకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్ పి.రంజిత్‌బాషాతో కలసి ఆమె సమీక్ష చేపట్టా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 ఏళ్ల ల్లోపు బాలికలకు వివాహాలు చేస్తే పోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఆడ పిల్లలను తప్పనిసరిగా చదివించాలన్నారు. రాష్ట్రంలో ఆరు నెలలుగా 746 బాల్య వివాహాలను అడ్డుకున్నామన్నారు. కలెక్టర్ పి.రంజిత్‌బాషా మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 64 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. కర్ణాటక సరిహద్దులోని ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, మంత్రాలయం, సీ బెళగల్‌లను హైరిస్ట్ మండలాలుగా గుర్తించామని, ఆయా మండలాల్లో 17, 18, 19 ఏళ్ల వయస్సు ఉన్న వారికే ఎక్కువగా వివాహాలు జరుగుతున్నాయన్నారు. వారిలో మధ్యలో బడి మానేసిన అమ్మాయిలు కూడా ఉన్నట్లు తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్వే ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 37 శాతం బాల్య వివాహాలు జరుగుతు న్నాయన్నారు. కొన్నేళ్లుగా బాల్య వివాహాల అనర్థాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నా ఫలితం లేకుండా పోతుందన్నారు. అనంతరం కిషోరి బాలిక స్వేచ్ఛకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, అడిషినల్ ఎస్పీ హుస్సేన్‌పీరా, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ రోహిణి, యూనిసెఫ్ డైరక్టర్‌మురళీకృష్ణ, ఐసీడీఎస్ పీడీ నిర్మల, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు.
మహిళా, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్యకుమారి
Comments
Please login to add a commentAdd a comment