రూ.4 లక్షల నగదు అపహరణ
● పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించిన
బాధితులు
పత్తికొండ రూరల్: పొలాన్ని విక్రయించగా వచ్చిన రూ.4 లక్షల నగదు బైక్‌లో పెట్టుకుని అత్త, అల్లుడు సోమవారం పత్తికొండ అంబేడ్కర్ కూడలిలో ఓ హోటల్ వద్దకు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. బైక్‌లో ఉంచుకున్న రూ.4లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్దహుల్తి గ్రామానికి చెందిన బోయ వరలక్ష్మి పొలాన్ని యాటకల్లు కురువ చిరంజీవికి విక్రయించింది. ఈరోజు పొలం విక్రయ నగదు ఇస్తామని మధ్యవర్తిగా ఉన్న పత్తికొండ పెట్రోలు బంకు సమీపంలోని దూదేకొండ గ్రామానికి చెందిన ఈడిగ జయప్రకాశ్‌గౌడు ఇంటి వద్దకు పిలిచి రూ.4 లక్షలు డబ్బు ఇచ్చారు. డబ్బు తీసుకుని ఆమె అల్లుడు బోయ వెంకటేష్‌తో కలిసి బైక్ ముందున్న ట్యాంకు బ్యాగులో పెట్టుకుని పత్తికొండలోని అంబేడ్కర్ కూడలిలో ఉన్న ఓహోటల్ వద్ద టిఫిన్ తినేందుకు వెళ్లారు. అక్కడ నిలబడి ఉండగా బైక్ బ్యాగులోని నగదును అక్కడే పథకం ప్రకారం మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. సీఐ జయన్న పోలీసు సిబ్బందితో దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఆటోలు ఢీకొని ఒకరి మృతి
● మరో నలుగురికి గాయాలు
ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు–లొద్దిపల్లె రహదారిలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కుమ్మరి వినోద్‌కుమార్ తన ఆటోలో కర్నూలుకు బయలుదేరాడు. వెల్దుర్తి మండలం పుల్లగుమ్మికి చెందిన హరికృష్ణ తన ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని కర్నూలు నుంచి స్వగ్రామం పుల్లగుమ్మికి బయలుదేరాడు. మార్గమధ్యలో నన్నూరు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వినోద్ కుమార్, వెంకటలక్ష్మమ్మ, షేక్ సలీంబాషా, రమిజాబీ, లొద్దిపల్లెకు చెందిన పోతురాజు దాసు(45) గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోతురాజు దాసు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సునీల్ కుమార్ తెలిపారు.
కర్ణాటక మద్యం స్వాధీనం
కోసిగి: మండల పరిధిలోని ఆర్లబండ గ్రామానికి చెందిన వందగల్లు వీరేష్ అనే వ్యక్తి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్లబండ గ్రామ పరిసరాల్లో పర్యటిస్తుండగా వందగల్లు వీరేష్ 576 ఒరిజనల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లతో పట్టుబడినట్లు తెలిపారు. వీటి విలువ రూ.23,040 ఉంటుందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐ కార్తీక్ సాగర్, హెడ్‌కానిస్టేబుల్ కె.నాగరాజు, డి.కిశోర్ కుమార్, కానిస్టేబుల్స్ మునిరంగడు, భరత్, రవి పాల్గొన్నారు.
రూ.4 లక్షల నగదు అపహరణ
Comments
Please login to add a commentAdd a comment