కుందేలు కాను... ఊత కర్రను
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న కర్రను చూస్తే చెవులు నిక్కబొడిచి నిలుచున్న కుందేలులా కనపడుతుంది కదా... నిజమే శ్రీశైలం వెళ్లే పాదయాత్రికుల కోసం చెంచులు వెదురు పొదలను తవ్వి వంపుతిరిగిన వెదురు వేర్లను జాగ్రత్తగా పాలిష్ చేసి ఊత కర్రగా మారుస్తుంటారు. సృజనాత్మకతకు నిలువెత్తు రూపాలైన ఆదిమ గిరిజనులైన చెంచులు ఆ కర్రలను కూడా తమదైన రీతిలో కళాత్మకంగా తయారు చేస్తుంటారు. కొన్ని పాముపడగలా కనిపిస్తే, మరికొన్ని కుందేలు తలలా కనిపించేలా వారి చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి. ఆత్మకూరు అట వీ డివిజన్‌లోని నాగలూటి వీరభద్రాలయం వద్ద కుందేలు తలలాంటి చేతికర్ర విక్రయిస్తూ ఓ చెంచు యువకుడు కనిపించాడు. – ఆత్మకూరు రూరల్
Comments
Please login to add a commentAdd a comment