బనగానపల్లె జెడ్పీ పాఠశాల బాలికలు భళా
బనగానపల్లె రూరల్: స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయ ఉపకార వేతన పరీక్షలో సత్తా చాటారు. ఏకంగా 16 మంది విద్యార్థినులు అర్హత సాధించి ఔరా అనిపించారు. ఉపకార వేతనాలకు ఎంపికై న విద్యార్థినులు 8వ తరగతి విద్యార్థినులు ఎస్.ఉషారాణి, డి.హాసియా, డి.సబిహ, కె.జ్ఞానేశ్వరి, ఎం.హరిక, బి.మధుమీనాక్షి, ఎస్.ఫిర్‌దోస్‌బీ, ఎస్.సుమయా, జీఎస్ ప్రియాంక, సి.రజిత, టి.జ్యోతి, ఏ.ఇమాన్, ఎస్.శ్రీలత, ఎం.వనితకుమారి, పీబీ మధుచందన, పి.జ్వాలను సోమవారం పాఠశాలలో హెచ్‌ఎం బాలగంగధర్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయినులు వి.షహనాజ్‌బేగం, ఫిర్దోస్, లక్ష్మీనారాయణమ్మ, వరలక్ష్మి, లలితమ్మ, లక్ష్మీదేవి, నీలిమ పాల్గొన్నారు.
● మండలంలోని ఇల్లూరుకొత్తపేట బీసీ వసతి గృహం విద్యార్థి కె జగన్ ఉపకార వేతనానికి అర్హత సాధించినట్లు వార్డెన్ మునిరాజు తెలిపారు. విద్యార్థి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడన్నారు.
జాతీయ ఉపకార వేతనాలకు
ఒకే పాఠశాల నుంచి 16 మంది
విద్యార్థినులు ఎంపిక
అభినందించిన ఉపాధ్యాయ బృందం
బనగానపల్లె జెడ్పీ పాఠశాల బాలికలు భళా
Comments
Please login to add a commentAdd a comment