కర్నూలు: జిల్లాలో 110 గ్రామాలను నాటుసారా ప్రభావిత ప్రాంతాలుగా ఎకై ్సజ్ అధికారులు గుర్తించారు. నేర తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను ఎ, బి, సి కేంద్రాలుగా విభజించారు. నవోదయంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో సారా తయారీని పూర్తిగా నిర్మూలించేందుకు ఎకై ్సజ్ అధికారులు కార్యాచరణను రూపొందించారు. డిప్యూటీ కమిషనర్ నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు ఆయా నాటుసారా ఉన్న గ్రామాలు, ప్రాంతాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాల క్రైం ప్రొఫైల్, నేరస్థుల వివరాలు సేకరించి మొదటి 30 రోజులు ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. కళాజాత వంటి సాంస్కృతిక ప్రదర్శనతో ప్రజల్లో నాటుసారా నిర్మూలనపై చైతన్యం కల్పించడం.. గ్రామస్థాయిలో సర్పంచు, వీఆర్వో, ఎ కై ్సజ్ కానిస్టేబుల్ సభ్యులుగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీపీ, పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎకై ్సజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎస్పీ, ఎకై ్సజ్ డిప్యుటీ కమిషనర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సభ్యులుగా ఉండి నవోదయం అమలుకు నిరంతరం సమీక్షించేలా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా పాత నేరస్థులను బీఎన్‌ఎస్‌ఎస్ 128 అండ్ 129 కింద బైండోవర్ చేసి వారిలో సత్ప్రవర్తనకు కృషి చేయనున్నారు. రెండవ దశలో నాటుసారా స్థావరాలపై దాడులు, అమ్మకం, విక్రయాలు మానని వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం, సత్ప్రవర్తన కలిగి సారా వ్యాపారాన్ని వదిలేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం నవోదయం ముఖ్య ఉద్దేశ్యమని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు తెలిపారు. రెండు మాసాల్లో (60 రోజుల్లో) జిల్లాలో ఎకై ్సజ్ నేరాలకు సంబంధించిన కేసులు నమోదు కాకపోతే కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న జిల్లా స్థాయి కమిటీ కర్నూలును నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించేలా కార్యాచరణ రూపొందించినట్లు సుధీర్ బాబు తెలిపారు.
నేర తీవ్రతను బట్టి ఎ, బి, సి
కేంద్రాలుగా విభజన
నవోదయంలో భాగంగా నిర్మూలనకు
ఎకై ్సజ్ అధికారుల కార్యాచరణ
Comments
Please login to add a commentAdd a comment