చిన్నారులకు ఎంతో మేలు | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు ఎంతో మేలు

Published Tue, Feb 25 2025 1:11 AM | Last Updated on Tue, Feb 25 2025 1:08 AM

చిన్న

చిన్నారులకు ఎంతో మేలు

బాలల సత్వర చికిత్స కేంద్రా ల్లో పుట్టుకతో వచ్చే జబ్బులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అవసరమైన వారికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నిపుణులైన వైద్యుల వద్దకు పంపి చికిత్స, ఆపరేషన్లు నిర్వహించేలా చేస్తున్నాం. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు చికిత్స, మందులతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాల పంపిణీ చేస్తున్నాం. కర్నూలులోని కేంద్రం ఫోన్‌ నెంబర్‌ 08518–251043. – షేక్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌,

బాలల సత్వర చికిత్స కేంద్రం, మేనేజర్‌

తలసేమియా ముందే గుర్తించాం

నేను ఓ ప్రైవేటు కంపెనీలో సర్వీస్‌ అడ్వయిజర్‌గా పనిచేస్తు న్నా. మా బాబు బబీష్‌ వర్మకు సంవత్సరం ఏడు నెలల వయస్సు. బాబు 8 నెలలోనే జన్మించాడు. దీంతో పాటు పుట్టినప్పుడు బరువు 1.5 కిలోలు మాత్రమే. అందుకే రెగ్యులర్‌గా ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో చికిత్స చేయిస్తున్నాం. ఈ క్రమంలో ఆరో నెలలో బాబుకు రక్తం తక్కువగా ఉందని తెలుసుకొని పరీక్షలు చేయించగా తలసేమియా నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక దశలో ఉండటంతో రెగ్యులర్‌గా మందులు వాడుతున్నాం. – పృథ్వీరాజ్‌, కర్నూలు

బాబు మాట్లాడుతున్నాడు

నా భార్యకు రెండవ కాన్పులో మగపిల్లవాడు జన్మించాడు. ఇప్పుడు నాలుగున్నరేళ్లు. మొదట్లో మాటలు సరిగ్గా వచ్చేవి కావు. బాలల సత్వర చికిత్స కేంద్రానికి వచ్చాక మార్పు కనిపించింది. బాబు ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాటు మాట్లాడుతున్నాడు.

– కె.సుధాకర్‌, కలమందలపాడు, కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment
చిన్నారులకు ఎంతో మేలు 
1
1/2

చిన్నారులకు ఎంతో మేలు

చిన్నారులకు ఎంతో మేలు 
2
2/2

చిన్నారులకు ఎంతో మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement