‘సీమ’కు జలవనరుల రాజధాని ‘కర్నూలు’. ఇంతటి ప్రాధాన్యత కలి
రాష్ట్రంలోనే అత్యంత
పేద జిల్లా కర్నూలు
● సోషియో ఎకనమిక్ సర్వే వెల్లడి
● అత్యధిక సాగుభూమి సొంతమైనా
అందని నీరు
● వర్షాధార పంటలతో
ఏటా తప్పని వలసలు
● ఉపాధి, ఉద్యోగాల కల్పనకు
పరిశ్రమలూ కరువే..
● అక్షరాస్యతలోనూ చివరి స్థానం
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
ప్రత్యేక చొరవ
● కూటమి ప్రభుత్వంలో సీమ నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి ‘సోషియో ఎకనమిక్ సర్వే’ విడుదల చేసింది. ఇందులో అత్యంత ధనిక జిల్లాగా పశ్చిమ గోదావరి మొదటి స్థానంలో, అత్యంత పేద జిల్లాగా కర్నూలు చివరి స్థానంలో నిలిచాయి. నిజానికి ఈ రెండు జిల్లాల్లోని పరిస్థితిని పోల్చి చూస్తే ప్రధానంగా సాగునీటి వనరులే ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలో 12.5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 2.57లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 6.45 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. అంటే మన కంటే దాదాపు 50 శాతం తక్కువ. అయితే 4.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఆ జిల్లాలో సాగునీటి కాల్వల ద్వారా 4.12 లక్షల ఎకరాలకు మూడు పంటలకు నీరు అందుతుంటే, ఇక్కడ కేవలం 60 వేల ఎకరాలకు మాత్రమే కాలువల ద్వారా నీరు పారుతోంది. ఇదొక్క ఉదాహరణతో సాగునీటి కల్పనలో ఎంత వెనుకబడి ఉన్నామో తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో బోర్ల ద్వారా 1.72లక్షల ఎకరాలు, చెరువుల ద్వారా 25వేల ఎకరాలకు నీరు అందుతుండగా.. పశ్చిమ గోదావరిలో బోర్ల ద్వారా 47వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది.
వలస వెళ్తున్న కోసిగి గ్రామస్తులు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా ద్వారా సాగునీరు కల్పించే అవకాశం ఉన్నా ఆ దిశగా పాలకులు ఆలోచించని పరిస్థితి. కర్నూలు జిల్లా పాలకులు కూడా ఈ పాపంలో భాగస్వాములే. సిటీని పక్కన పెడితే ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి అవకాశాలు స్వల్పం. కేవలం వర్షాధారంపై ఆధారపడి మాత్రమే పంటలు సాగు చేస్తారు. వర్షాలు రాకపోతే కరువు బారిన పడాల్సిందే. బతికేందుకు ‘సుగ్గిబాట’ పట్టాల్సిందే. ఆదోని డివిజన్ నుంచి ఏటా లక్షల మంది బతికేందుకు కర్ణాటక, తెలంగాణ, కేరళతో పాటు కోస్తాంధ్ర ప్రాంతాలకు వెళతారంటే ఇక్కడ ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది.
ఈ దిశగా ఆలోచించరేం!
గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే డిస్ట్రిబ్యూటరీలతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతం మొత్తానికి తాగు, సాగునీరు అందుతుంది.
మన జిల్లాతో పాటు కేసీ కెనాల్ ద్వారా కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాలోని 2.65లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
తుంగభద్ర డ్యాం నుంచి ఏటా సగటున 200 టీఎంసీలు కిందకు వెళుతున్నా ఆ నీటిని మనం వినియోగించుకోలేకపోతున్నాం.
20.15 టీఎంసీల సామర్థ్యంతోగుండ్రేవుల నిర్మిస్తే కనీసం వరద రోజులతో కలిపి 40 టీఎంసీలకుపైగా నీటిని వినియోగించుకోచ్చు. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు.
ఊళ్లూ వదిలి..
Comments
Please login to add a commentAdd a comment