రాజకీయ కక్షతో వేధిస్తే ప్రజలే తిరగబడతారు
కర్నూలు: రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధిస్తే ప్రజలే తిరగబడతారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లను దుర్భాషలాడారన్న అభియోగంపై ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రముఖ సినీనటుడు పోసాని మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 5వ తేదీన రిమాండ్‌పై ఆయనను కర్నూలు శివారులోని జిల్లా కారాగారానికి తరలించారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోమవారం జిల్లా జైలుకు వెళ్లి పోసాని మురళీకృష్ణతో ములాఖత్ అయి పరామర్శించారు. అనంతరం కారాగారం గేటు బయట కాటసాని మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నాయకుల మీద కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని, అధికారం ఉంది కదా అని రాజకీయ కక్షతో ఒకే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకు లు ఏది మాట్లాడినా అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, అదే టీడీపీ నాయకులు మాట్లాడితే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. చట్టం అనేది ఒకరి సొత్తు కాదని, అందరికీ సమానంగా ఉండాలన్నారు. ఎళ్లకాలం ఒకేలా ఉండదని, కూటమి నాయకులు గుర్తు పెట్టుకుని నడుచుకోవాలన్నారు.
ప్రముఖ సినీనటుడు
పోసాని మురళీకృష్ణతో
ములాఖత్ సందర్భంగా కాటసాని
Comments
Please login to add a commentAdd a comment