చంద్రబాబు చెప్పారు కాబట్టే అడుగుతున్నాం
సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇల్లు లేనిపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు. కాబట్టే ఇప్పుడు ఇంటి స్థలం ఇవ్వాలని అడుగుతున్నాం. మాకు సొంతిల్లు లేదు. అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్నాం. ఇంటి స్థలంతోపాటు నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాల్సిందే. పేదల ఆశలతో ఆడుకుంటే రోడ్డెక్కి ఆందోళనలు చేపడతాం. – సరిత, అమీర్ హైదర్‌ఖాన్‌నగర్, కర్నూలు
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న పేద మహిళలు
పేదలకు అన్యాయం
కర్నూలు, కల్లూరు పరిధిలోని పేదలకు 15 రోజుల్లో సర్వే నంబర్ 70/2బీలో ఉన్న 16.85 ఎకరాలు, సర్వే నంబర్ 68లో ఉన్న 12.75 ఎకరాల భూమిలో లే అవుట్ వేసి పట్టాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పేదలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 2 గంటల పాటు సీపీఎం ఆధ్వర్యంలో ఽనిరసన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా అధ్యక్షుడు డి.గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ..పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూంటే ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ పెద్దలు భూములను ఆక్రమిస్తూ ఉంటే ఏమి అనని అధికారులు...పేదలు అటువైపు వెళ్లితే నిబంధనలు చెబుతున్నారని విమర్శించారు. 15 రోజుల్లో పట్టాలు ఇవ్వకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజశేఖర్, వై.నగేష్, అలివేలు, అరుణ, విజయరామాంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment