ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్
కర్నూలు (సెంట్రల్): వర్షపు ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకుని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఆయన సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి పొదుపు, వినియోగం, నిర్వహణపై కొన్ని ప్రాంతాల కలెక్టర్ల పనితీరును సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, పారిశ్రామికవేత్తల ఆర్థిక సాయం, సీఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులతో మాట్లాడారు. ఫారం పాండ్స్, అమృత సరోవర్ తదితర పనులపై డ్వామా పీడీ వెంకటరమణయ్యను, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్‌పై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావును, చెరువులు, మైనర్ డ్యామ్‌ల పునరుద్ధరణ పై ఇరిగేషన్ ఎస్‌ఈ ద్వారకానాథ్‌రెడ్డిని నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment