నిబంధనలకు ‘నీళ్లు’
ఆలూరు: నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో సర్పంచ్ అరుణాదేవి.. నిబంధనలకు నీళ్లు వదిలారు. ప్రజలకు ఇబ్బందులు తెస్తూ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ‘జీతభత్యాలు ఇస్తున్నాం..మేం చెప్పిన పనులు చేయాల్సిందే’ అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు పెడుతున్నారు. ఆలూరులోని ఇందిరా నగర్, అంబేడ్కర్ నగర్, గాంధీనగర్‌తో పాటు పలుకాలనీల్లో చేస్తున్న పనులకు శుద్ధమైన జలాన్ని వాడుతున్నారు. సీసీ రోడ్డుకు కంకర వేసే మిషన్‌లోకి శుద్ధమైన జలాన్ని నింపుతున్నారు. ఆలూరు మేజర్ పంచాయతీ కాగా.. 16 గ్రామ వార్డులు ఉన్నాయి. గతంలో రూ. 5 లక్షలను ఖర్చు చేసి ప్రజలకు శుద్ధమైన జలాన్ని అందించేందుకు ఏర్పాటు చేశారు. అయితే నేడు పంపులు చెడిపోవడంతో నీటిని అభివృద్ధి పనులకు వాడుకోవడంలో ఆంతర్య మేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్మికులతో కంకర డస్ట్ తొలగించే పనిని చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆలూరు సర్పంచ్ అరుణాదేవి చేయిస్తున్న పనులు బాగున్నాయని గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు మెచ్చుకోవడాన్ని చూసి ప్రజలు అవాక్కయ్యారు.
నిబంధనలకు ‘నీళ్లు’
Comments
Please login to add a commentAdd a comment