ఆదోని ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలి
జిల్లాలో పరిశ్రమల ఊసే లేదు. ప్రజలు జీవనోపాధికి ఎక్కడెక్కడికో వలస వెళ్తున్నారు. ఇప్పటికై నా ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆ ప్రాంతానికే చెందిన వారు కావడంతో పరిశ్రమల స్థాపనకు చొరవ తీసుకోవాలి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటైన ఆదోని ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ నిర్ణయాలను కొనసాగించాలి.
–విజయకుమార్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్
జిల్లా చైర్మన్, కర్నూలు
కర్నూలుకు ఎప్పుడూ అన్యాయమే
తరతరాలుగా కర్నూలుకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా జిల్లా అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం. వేదవతి, గుండ్రేవుల, సిద్ధేశ్వరం అలుగు చేపట్టాలని కోరుతున్నా పాలకులు నిర్లక్ష్యం వీడని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్, బెంగళూరు, చైన్నెలకు వలస వెళ్తున్నారు. ఓర్వకల్లును ఇండస్ట్రీయల్‌హబ్‌గా తీర్చిదిద్దుతామన్న మాటకు కట్టుబడాలి.
– శ్రీనివాసరెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, కర్నూలు
కూటి కోసం కొట్లాటలు తప్పవు
పడమటి ప్రాంతంలో వ్యవసాయం జూదంగా మారింది. వర్షాలు వస్తేనే రైతులు పంటలు పండించుకునే పరిస్థితి. ఎల్‌ఎల్‌సీ, గురురాఘేంద్ర ప్రాజెక్టులకు నీళ్లు రావడం లేదు. హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ కాలువ జిల్లా మీదుగా వెళ్తున్నా నీరందడం లేదు. దేవనకొండ, పత్తికొండ, కోసిగి, కౌతాళం మండలాల్లో సగం మంది ఊళ్లు విడిచి వలస పోవడం పరిపాటిగా మారింది. వ్యవసాయానికి సాగునీరు పెంచకపోతే కూటి కోసం భవిష్యత్‌లో కొట్లాటలు తప్పవు.
– ఎంఏ గఫూర్, మాజీ ఎమ్మెల్యే, కర్నూలు
ఆదోని ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలి
ఆదోని ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలి
Comments
Please login to add a commentAdd a comment