కర్నూలు(సెంట్రల్): ముంబయికి చెందిన రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కర్నూలు బ్రాంచ్ మేనేజర్‌పై జిల్లా వినియోగదారుల వ్యాజ్య పరిష్కార కమిషన్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 మేలో కమిషన్ రూ.4.22 లక్షలను ఓ కక్షిదారుడికి చెల్లించాలని ఆదేశాలిచ్చింది. దీనిపై ఆ కంపెనీ రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించింది. అయితే 2022 అక్టోబర్ 13న ఆ కంపెనీ వాదనను రాష్ట్ర కమిషన్ తిరస్కరించి జిల్లా కమిషన్ తీర్పును అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఇప్పటి వరకు కమిషన్ ఆదేశాలను కంపెనీ అమలు చేయకపోవడంతో గురువారం జిల్లా కిషన్ అధ్యక్షుడు కె.కిశోర్‌కుమార్, సభ్యులు ఎన్.నారాయణరెడ్డి, నజీమా కౌసర్ నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు.
నకిలీ విత్తన వ్యాపారికి కూడా..
పత్తికొండకు చెందిన శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్ యాజమాని డి.గంగాధర రావుపై గురువారం జిల్లా కిషన్ అధ్యక్షుడు కె.కిశోర్‌కుమార్, సభ్యులు ఎన్.నారాయణరెడ్డి, నజీమా కౌసర్ నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. ఆ వ్యాపారి ముగ్గురు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మి మోసం చేశాడు. బాధిత రైతులు కమిషన్‌ను ఆశ్రయించగా 2024 జూన్ 21న రూ.70 వేలు చెల్లించాలని వ్యాపారికి కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఇంతవరకు పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు మరోసారి కమిషన్‌ను ఆశ్రయించిన నేపథ్యంలో నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment