పోలీసు ప్రతిష్టను పెంచేలా సేవలందించండి
కర్నూలు: విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా సేవలందించి పోలీసు శాఖ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రొబేషనరీ ఎస్‌ఐలకు సూచించారు. అనంతపురం పీటీసీలో ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 8 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలను కర్నూలు జిల్లాకు కేటాయించారు. గురువారం వారు డీపీఓలో ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎనిమిది మంది సివిల్ ఎస్‌ఐలలో ఏడుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ప్రొబేషనరీ ఎస్‌ఐలను గ్రేహౌండ్స్, బెటాలియన్, సమస్యాత్మక ప్రాంతాల్లో కొన్ని నెలల పాటు విధులకు కేటాయించనున్నారు. అప్పగించిన విధులను బాధ్యతతో నిర్వర్తించి వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవడమే గాక పోలీసు ప్రతిష్టను పెంచాలని వారికి ఎస్పీ సూచించారు.
జిల్లాకు కేటాయించిన
ప్రొబేషనరీ ఎస్‌ఐలకు ఎస్పీ సూచన
Comments
Please login to add a commentAdd a comment