నాటుసారా రహిత జిల్లాగా మారుద్దాం
కర్నూలు: నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 కార్యక్రమం లక్ష్యమని, దీనికి అందరూ సహకరించాలని ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో గురువారం జిల్లాలోని ఇన్‌స్పెక్టర్లతో ఆమె నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారాను జిల్లాలో సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం నవోదయం 2.0ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో సభలు నిర్వహించారు, ఎంతమంది పాత నేరస్థులను బైండోవర్ చేశారు, ఎన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు తదితర అంశాలపై సమీక్షించారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మచ్చా సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ట్రైనీ ఏఈఎస్ హర్ష యశస్కర్‌తో పాటు అన్ని స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు. ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు భార్గవ రెడ్డి, రమేష్‌రెడ్డి, సందీప్, సోమశేఖర్, నవీన్ బాబు, రెహనాబేగం, కృష్ణా నాయక్, ఇందిర కిరణ్ తదితరులు డీసీని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment