ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం●
● కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాలు
● ఇళ్ల స్థలాల కోసం పేదల నిరసన
● కామన్ పీజీసెట్‌ను రద్దు చేయాలన్న
విద్యార్థులు
● హిందూ సంఘాల నాయకుల
ఆందోళన
ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో సమస్యలు.. ప్రతి రోజూ అవస్థలే.. అయినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించకోపవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీగా కలెక్టరేట్‌కు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలిపారు. ప్రజల కష్టాలు పట్టవా అంటూ పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ అధినేత
స్పందించకపోతే ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కామన్ పీజీసెట్ ఎంట్రెన్స్‌తో తమకు నష్టం వాటిల్లుతోందని, దానిని రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వరా.. ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని వివిధ సంఘాల నాయకులు మండిపడ్డారు. కర్నూలు జిల్లా పేరు లేకుండానే రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం దుర్ణీతికి నిదర్శనమని సీపీఐ నాయకులు ఆరోపించారు. జిల్లాకు జరిగిన అన్యాయంపై ధర్నా నిర్వహించారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో జరుగుతున్న కూల్చి వేతలను వెంటనే నిలపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. – కర్నూలు(సెంట్రల్)
Comments
Please login to add a commentAdd a comment