నోట మాట రావడం లేదు
● ధరలు భారీగా పతనం
● పొలాల్లోనే దిగుబడిని వదిలేసిన రైతులు
టమాట పంట సాగు చేసిన రైతుల నోట మాట రాక మూగబోయింది. పంట ఆరంభం నుంచి కోత దశ వరకు అష్ట కష్టాలు పడి సాగు చేసినా ఒకవైపు తెగుళ్లు.. మరో వైపు నిలకడలేని ధరల కారణంగా నష్టాలు మూట గట్టుకున్నారు. ఆఖరికి పంటపై పెట్టిన పెట్టుబడి కూడా చేతి కందే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచక సతమతమవుతున్నారు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి భగవంతుడా..! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రబీలో మండల వ్యాప్తంగా దాదాపుగా 150 ఎకరాల్లో పంట సాగు చేయగా ధర మాత్రం గత మూడు నెలలుగా ఒడిదుడుగులకు గురవుతుంది. 25 కేజీల బాక్స్ కేవలం రూ.80 లకే మార్కెట్‌లో ధర పలకుతుండటంతో కోత కోసిన కూలీల ఖర్చు కూడా రావడం లేదని పంటను పొలాల్లో వదిలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– కృష్ణగిరి
నోట మాట రావడం లేదు
Comments
Please login to add a commentAdd a comment