నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 25, 26 తేదీల్లో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన సమాచార సేకరణపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాయిల్ టెస్టు ఫలితాలను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పెండింగ్‌లోని గోకులాల నిర్మాణాలకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించి విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు త్వరగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన వసతి గృహాల మరమ్మతులను త్వరగా చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 24 హాస్టళ్లకు సంబంధించి రూ.7.89 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐసీడీఎస్‌కు సంబంధించి 146 అంగన్‌వాడీ సెంటర్లను అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సీపీఓ హిమప్రభాకరరాజు, కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment