ముగిసిన సుయతీంద్రతీర్థుల సమారాధన
మంత్రాలయం: నవ మంత్రాలయం శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థుల ఉత్తరారాధనతో వేడుకలు ముగిశాయి. గురువారుం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మధ్యారాధన వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవతో ఆరాధనకు అంకురార్పణ పలుకగా.. వేద పఠనం గావిస్తూ సుయతీంద్రతీర్థుల మూల బృందావనానికి శాస్త్రోక్తంగా విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆధ్యాత్మిక పరిమళాలు విరబూసేలా మధ్యారాధన పూజోత్సవాలు గావించారు. కర్ణాటకలోని మత్తూరు మఠం పీఠాధిపతి బోధానంద సరస్వతీ శ్రీమఠాన్ని సందర్శించి పీఠాధిపతులు సుబుధేంద్రతీర్థులను సన్మానించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విధ్వాంసులు, కళాకారులను స్వామిజీ సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment