జీజీహెచ్‌కు హైరిస్క్ కేసులే ఎక్కువ
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి గతంలో సాధారణ కాన్పులకు కూడా వచ్చేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం హైరిస్క్ కేసులే వస్తున్నాయి. గతంలో 40 దాకా ప్రసవాలు జరుగుతుండగా, ఇప్పుడు 15 నుంచి 20 శాతానికి మించని పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం నంద్యాల జిల్లా విడిపోవడం, అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు లక్ష్యాలు విధించడం, ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య పెరగడం, అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉండటమే. కర్నూలు చుట్టుపక్క మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రసవాలు జరుగుతుండంతో జీజీహెచ్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గింది.
– డాక్టర్ శ్రీలక్ష్మి, హెచ్‌ఓడీ, గైనకాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment