కేజీబీవీ పిలుస్తోంది!
● అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
● వచ్చే నెల 11వ తేదీ వరకు గడువు
కర్నూలు సిటీ: కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) అడ్మిషన్లకు ప్రతి ఏటా పోటీ పెరుగుతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆన్‌లైన్‌లో శనివారం నుంచి వచ్చే నె ల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్(మధ్యలో చదువు మానేసిన వారు), పేద, బడుగు, బలహీన, మైనార్టీ, బీపీఎల్ కుటుంబాల్లోని బాలికలు మాత్రమే అర్హులు. అర్హులైన వారు https:// apkgbv.apcfss.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకే...
బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు 2004–05 విద్యా సంవత్సరంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొదటగా ఏర్పాటు చేసిన స్కూళ్లలలో 9,10 తరగతులకు అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ చదువుతున్న బాలికలు సెకెండరీ విద్యకు దూరం అవుతున్నారని గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆ స్కూళ్లలో ఇంటర్మీడియెట్, వృత్తివిద్య కోర్సులను ప్రవేశ పెట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 కస్తూర్బా గాంఽధీ బాలిక విద్యాలయాలు ఉండగా.. 6 నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియేట్ విద్య, వృత్తి విద్యా కోర్సులు ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ప్రతి తరగతికి 40 సీట్లు ఉన్నాయి. మైనార్టీలకు ప్రత్యేక కేజీబీవీలు, ఉర్దూ మీడియంలో సైతం ఓ కేజీబీవీ స్కూల్ అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment