కర్నూలు: పాతబస్తీలోని గడ్డా వీధిలో నివాసముంటున్న షేక్ అక్బర్ మియా (75) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈయన గతంలో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగానే ఉంటున్నాడు. నలుగురు ఆడపిల్లలు, ఒక కొడుకు సంతానం. గురువారం కల్లూరు ఇందిరమ్మ కట్ట వద్ద సొహైల్ అనే వ్యక్తి బైక్ వెనుక కూర్చొని పాత ఈద్గా వైపు వెళ్తున్నాడు. బిస్మిల్లా హోటల్‌కు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా కుక్క అడ్డు రావడంతో సొహైల్ కుక్కను తప్పించబోయి పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ కింద పడి గాయాలకు గురయ్యాడు. బైక్ నడుపుతున్న సొహైల్‌కి స్వల్ప గాయాలు కాగా వెనుక కూర్చున్న షేఏక్ అక్బర్ తలకు బలమైన గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు ఇద్దరినీ 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో చికిత్స పొందుతూ తెల్లవారుజామున షేక్ అక్బర్ మియా మృతిచెందారు. కుమారుడు మహబూబ్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.