
శనగ సాగు చేసి నష్టపోయాం
మాకున్న నాలుగు ఎకరాల్లో రబీ సీజన్‌లో శనగ సాగు చేశాం. ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టాం. వర్షాలు లేక భూమిలో తేమ లేకపోవడంతో దిగుబడి తగ్గింది. ఎకరాకు సగటున 6 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. క్వింటాకు రూ.5వేల ధర మాత్రమే లభించింది. పూర్తిగా నష్టపోయాం. మా మండలాన్ని ప్రభుత్వం ఎందుకు కరువు ప్రాంతంగా గుర్తించలేదో తెలియడం లేదు.
– పూజారి బీరప్ప, రాతన, తుగ్గలి మండలం
భూగర్భ జలాలు
అడుగంటి పంట నష్టం
పశ్చిమ ప్రాంతంలోని కోసిగి మండలం అత్యంత వెనుకబడిన ప్రాంతమని అందరికీ తెలుసు. అయితే 2024–25 కరువు మండలాల జాబితాలో మా మండలం లేకపోవడం దారుణం. వందగళ్లు గ్రామంలో భూగర్భ జలాలు 40 మీటర్ల అడుక్కు వెళ్లాయి. మేము రబీలో ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాం. భూగర్భ జలాలు అడుగంటి పంట పూర్తిగా దెబ్బతినింది. పెట్టుబడి ఎకరాకు రూ.25 వేల వరకు వచ్చింది. నాలుగు బస్తాల పంట కూడా రాలేదు.
– ఈరన్న, వందగళ్లు, కోసిగి మండలం
జిల్లా మొత్తాన్ని
కరువు ప్రాంతంగా గుర్తించాలి
ఖరీఫ్ కరువు మండలాలను ప్రకటించడంలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. రబీలో అన్ని మండలాల్లో మరింత తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ జిల్లాలో కర్నూలు జిల్లాలో 10 మండలాలు, నంద్యాల జిల్లాలో 4 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించడం అన్యాయం. ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను
ఆదుకోవాలి.
– జి.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతుసంఘం

శనగ సాగు చేసి నష్టపోయాం

శనగ సాగు చేసి నష్టపోయాం