తర్తూరు జాతర చూసొద్దాం రండి! | - | Sakshi
Sakshi News home page

తర్తూరు జాతర చూసొద్దాం రండి!

Published Sun, Apr 6 2025 12:19 AM | Last Updated on Sun, Apr 6 2025 12:19 AM

తర్తూ

తర్తూరు జాతర చూసొద్దాం రండి!

జూపాడుబంగ్లా మండలం మీదుగా వెళ్తున్న కర్నూలు–గుంటూరు రహదారికి 1.50 కిలోమీటర్ల దూరంలో తర్తూరు గ్రామం ఉంది. సుమారు 735 ఏళ్ల క్రితం గ్రామంలోని ఉల్ఫా వంశానికి చెందిన రాజారెడ్డికి తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రంగమ్మతో వివాహమైంది. ఏటా హోలీ పున్నమినాడు దంపతులు ఇద్దరు పుట్టినిల్లు శ్రీరంగాపురంలో జరిగే శ్రీలక్ష్మిరంగనాథస్వామి ఉత్సవాలకు వెళ్లేవారు. వేడుకల అనంతరం ఆడ బిడ్డకు పుట్టింటివారు ఒడిబియ్యం పెట్టడం ఆనవాయితీగా ఉండేది. ఆ సందర్భంగా రంగమ్మకు ఒడిబియ్యం పెట్టి పండంటి బిడ్డ పుట్టాలని ఆడబిడ్డ రూపంలో ఉన్న ఓ చెక్కబొమ్మను పెట్టేవారు. తర్తూరు వచ్చిన తర్వాత రంగమ్మ పుట్టినింటి నుంచి తెచ్చిన ఒడిబియ్యాన్ని విప్పి చూడగా అందులో ఆడరూపంలో ఉన్న బొమ్మ మగరూపంలోకి మారుతుండటంతో మెట్టినింటివారు కోడలిని మందలించేవారు. ఒడిబియ్యంలోని మగరూపంలో ఉన్న చెక్కబొమ్మను పారవేసేవారు. దీంతో వారి వంశస్తులు ఎవ్వరో ఒకరు చనిపోతుండటంతో పాటు అనారోగ్యాల బారిన పడుతుండేవారు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు జరగడంతో కోపంతో వారు చెక్కబొమ్మను పశువుల గాడిలోకి విసిరివేయటంతో రంగనాథస్వామి పూనకం వచ్చి తాను శ్రీరంగనాథస్వామినని తెలిపారు. తాను తర్తూరులోనే కొలువుంటానని, తనకు ఏటా జాతర నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించటంతో పాటు పాడిపంటలు వృద్ధిచెందేలా చేయటంతో పాటు వంశాభివృద్ధి చెందుతుందని ఆయన ఆశీర్వదించాడు. అప్పటి నుంచి ఉల్ఫా వంశస్తులు స్వామివారు కొలువుదీరిన ఇంటితోపాటు 60 ఎకరాల పొలాన్ని స్వామివారికి దారాధత్తం చేసి ఏటా జాతర నిర్వహించేవారు.

కల్యాణం శ్రీరంగాపురంలో..

శ్రీలక్ష్మీరంగనాథునికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించి అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నప్పటికీ కల్యాణం ఇక్కడ నిర్వహించకపోవటం గమనార్హం. శ్రీలక్ష్మీరంగనాథస్వామి తెలంగాణలోని శ్రీరంగాపురం నుంచి హోలీపౌర్ణమి అనంతరం నంద్యాల జిల్లాలోని తర్తూరు గ్రామానికి చేరుకుంటాడు. ఇక్కడ స్వామివారిని పెళ్లికుమారునిగా ముస్తాబు చేసి పదిరోజులపాటు పలురకాల వాహనాలపై ఊరేగిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తర్తూరులో పెళ్లి కుమారుడైన స్వామివారు నెల్లూరు జిల్లాలోని శ్రీరంగాపురం వెళ్లి అక్కడ శ్రీలక్ష్మీదేవి అమ్మవారితో కల్యాణం జరిపించుకుంటారని పూర్వికులు పేర్కొంటున్నారు.

13న రథోత్సవం

నేటి నుంచి ప్రారంభమయ్యే తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 13న స్వామివారి దివ్యమంగళ రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరరెడ్డి, ఫెస్టివల్‌ కమిటీ చైర్మన్‌ నారాయణరెడ్డి తెలిపారు.

కొలిచిన వారికి కొంగుబంగారం లక్ష్మీరంగనాథస్వామి

నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

13న రథోత్సవం

కొలిచిన వారికి కొంగుబంగారమై శ్రీలక్ష్మీరంగనాథస్వామి తర్తూరు గ్రామంలో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాడు. భక్తులతోపాటు అన్నదాతలకు ఆరాధ్యదైవమై వెలుగొందుతూ పాడిపంటలు వృద్ధిచెందేలా అన్నదాతలను ఆశీర్వదిస్తున్న రంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమై ఈనెల 15 వరకు కొనసాగనున్నాయి. ఈనెల 13న స్వామి వారి రథోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే తర్తూరు జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుంది. ఈ జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని నలుమూల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. – జూపాడుబంగ్లా

తర్తూరు జాతర చూసొద్దాం రండి! 1
1/3

తర్తూరు జాతర చూసొద్దాం రండి!

తర్తూరు జాతర చూసొద్దాం రండి! 2
2/3

తర్తూరు జాతర చూసొద్దాం రండి!

తర్తూరు జాతర చూసొద్దాం రండి! 3
3/3

తర్తూరు జాతర చూసొద్దాం రండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement