మటన్ @ రూ.1,100
మహబూబాబాద్: జిల్లాలో మటన్‌షాపులు కిటకిటలాడుతున్నాయి. చికెన్ ప్రియులు బర్డ్ ఫ్లూ భయంతో కోడి మాంసం తినడం లేదు. మటన్ తినేందుకు ఆసక్తి చూపుతుండడంతో ధరలు పెరిగా యి. కాగా చికెన్, గుడ్లు తినేవారి సంఖ్య తగ్గిందని, షాపులు వెలవెలబోతున్నాయని చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ సంక్రమణ లేదని సంబంధిత అధికారులు అంటున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా చికెన్ తినొచ్చని సూచిస్తున్నారు.
1,000పైగా చికెన్ సెంటర్లు..
జిల్లాలో వెయ్యికిపైగా చికెన్ షాపులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో 120కిపైగా మట న్ షాపులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, మహా రాష్ట్రలో బర్డ్ ప్లూ వైరస్ ఎక్కువగా ఉందని, మానుకోట జిల్లాలో మాత్రం వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు చెబుతున్నా.. చికెన్ తినేందుకు జనం జంకుతున్నారు. ఇతర జిల్లాలో కోళ్లు మృతి చెందడం, ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించడంతో ప్రజలు దూరంగా ఉంటున్నారు. ఉడికిన చికెన్‌లో వైరస్ చనిపోతుందని కొంత మంది వైద్యులు చెబుతున్నా.. ప్రజలు ధైర్యం చేయడం లేదు.
తగ్గిన చికెన్ ధరలు..
బర్డ్ ఫ్లూ వైరస్ భయంతో ప్రజలు చికెన్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో నెలరోజుల నుంచి చికెన్ షాపులు వెల వెల బోతున్నాయి. నెలరోజుల క్రితం కేజీ చికెన్ ధర రూ.250 ఉంటే నేడు కేజీ రూ.170కి ఇచ్చినా కొనుగోలు చేసే వారు చాలా తక్కువ అని షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 90 చికెన్ షాపులు ఉండగా బర్డ్ ఫ్లూ కంటే ముందు ప్రతీరోజు ఐదు టన్నుల చికెన్ విక్రయాలు జరుగగా.. ప్రస్తుతం టన్ను చికెన్ విక్రయం కూడా జరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కోడి గుడ్లు కేస్ రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.140కి పడిపోయింది.
మార్కెట్‌లో పెరిగిన ధర, విక్రయాలు
బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్ తినేందుకు
జంకుతున్న జనం
నష్టపోతున్న చికెన్ వ్యాపారులు
జిల్లాలో వైరస్ సంక్రమణ లేదంటున్న అధికారులు
పెరిగిన మటన్ ధరలు..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మాంసం తినడానికి ఇష్టపడుతున్నారు. దీంతో మటన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఈమేరకు వ్యాపారులు ధరలు పెంచారు. బర్డ్ ప్లూ వైరస్ కంటే ముందు కేజీ మాంసం రూ.800 నుంచి రూ.900 విక్రయిస్తే.. వైరస్ భయం నేపథ్యంలో కిలో మటన్ రూ.1100కు విక్రయిస్తున్నారు. జిల్లా మొత్తంలో 120కి పైగా మటన్ షాపులు ఉన్నాయి. కాగా మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 10 షాపులు ఉండగా.. ప్రతీరోజు 3క్వింటాళ్ల మాంసం విక్రయిస్తున్నా రు. అంతకు ముందు 150కేజీల విక్రయాలు మాత్రం ఉండేవని, బర్డ్ ప్లూ ప్రచారంతో విక్రయాలు రెట్టింపు అయ్యాయని మటన్‌షాపుల నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా మాంసం ధరలు అధికంగా ఉండడంతో కొంతమంది రొయ్యలు, చేపలు కొనుగోలు చేస్తున్నారు.
మటన్ @ రూ.1,100
Comments
Please login to add a commentAdd a comment