అంజయ్యకు డీజీపీ అభినందన
మహబూబాబాద్ రూరల్: ఆల్ ఇండియాలో పోలీస్ డ్యూటీ మీట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఏఆర్ (బాంబ్ స్క్వాడ్ విభాగం) పీసీ కొంపెల్లి అంజయ్యను డీజీపీ జితేందర్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ డ్యూటీ మీట్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ శిఖాగోయల్, స్పోర్ట్స్ డైరెక్టర్ జనరల్ రమేశ్ పాల్గొన్నారు.
ప్రశాంతంగా
గురుకుల ప్రవేశ పరీక్ష
మహబూబాబాద్ అర్బన్: సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని సోషల్ వెల్ఫేర్ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ బి.జాక్విలిన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో 5,046 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష జరిగినట్లు చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో
శ్రీపాల్ రెడ్డిని గెలిపించాలి
మహబూబాబాద్ అర్బన్: నల్లగొండ–వరంగల్–ఖమ్మం నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సంఘం ఏఐఎఫ్ టీఓ జాతీయ ఉపాధ్యక్షులు బి.గీత కోరారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఆదివారం పీఆర్‌టీ యూ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ.. విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యలు తెలిసిన ఏకై క వ్యక్తి శ్రీపాల్‌రెడ్డి అని, సీపీఎస్ రద్దు, జీఓ 317రద్దు కోసం పోరాడుతామన్నా రు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, హాలియానాయక్, కోట కనకయ్య, ఆకారపు వెంకటేశ్వర్లు, జిల్లా బాధ్యులు కొప్పుల నాగరాజు, తూడి వెంకటేశ్వర్లు, మహిళా ఉపాధ్యక్షురాలు భవాని తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలి
తొర్రూరు: ఉపాధ్యాయ సమస్యలపై ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్‌రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై డివిజన్ కేంద్రంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. తనను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేలా మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. సీపీఎస్ రద్దు, నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై సుదీర్ఘ కాలం పోరాటం చేస్తున్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తనకు ఉందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గుండెబోయిన నాగేశ్వర్‌రావు యాదవ్, వంగాల వెంకట్‌రెడ్డి, పాల నరేష్ పాల్గొన్నారు.
మార్చి 4 నుంచి
కేయూ ఎంబీఏ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. మార్చి 4, 6,11, 13, 17, 19, 21 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడవచ్చునని సూచించారు.
అంజయ్యకు డీజీపీ అభినందన
అంజయ్యకు డీజీపీ అభినందన
అంజయ్యకు డీజీపీ అభినందన
Comments
Please login to add a commentAdd a comment