మామిడి తోటల్లో జాగ్రత్తలు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్: మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులు ప్రస్తుత తరుణంలో సరైన జాగ్రత్తలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యాసంగిలో మామిడి తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చీడపీడల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు ఇచ్చారు. క్రాప్ బుకింగ్, పీఎం కిసాన్, రైతుబంధు, రైతు బీమా పథకాలపై జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, వ్యవసాయ అధికారి (టెక్నికల్) రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న
Comments
Please login to add a commentAdd a comment