సాహిత్యం సమాజానికి దిక్సూచి
మహబూబాబాద్ అర్బన్: సాహిత్యం సమాజానికి మంచి మార్గం చూపే దిక్సూచి అని మానుకోట రచయితల సంఘం(మరసం) జిల్లా అధ్యక్షుడు చింతకుట్ల కుమారస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మరసం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుట్ల కుమారస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకాలం నుంచి సాహిత్యాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారని, విద్యార్థులు, యువత సాహిత్యాన్ని అధ్యయనం చేయాలన్నారు. అనంతరం కవితల బులెటిన్‌ను కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మరసం జిల్లా కార్యదర్శి మద్దెర్ల రమేశ్, గౌరవ సలహాదారు సయ్యద్ ఖుర్షిద్, కళాకారుడు సత్యనారాయణ, గ్రంథాలయ సిబ్బంది వీరేందర్, అధ్యాపకులు చొప్పరి శ్రీనివాస్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment